వేసవిలో సౌందర్యం కాపాడుకోవాలంటే ఇలా చేయాలి

శనివారం, 26 ఫిబ్రవరి 2022 (00:13 IST)
వేసవిలో శరీరానికి తగినంత మంచినీరు అందేట్లు చూడాలి. అలా చేయకుంటే ఆరోగ్యం మాత్రమే కాదు సౌందర్యం కూడా చిన్నబోతుంది. అందుకే దిగువ సూచించిన చిట్కాలు పాటిస్తుంటే ఆరోగ్యమూ, అందం సొంతమవుతాయి.

 
రోజు వీలైనంత మేరకు ఎక్కువ నీటిని సేవించాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన చర్మం కోసం నీరు దివ్యమైన ఔషధం. నీరు తీసుకోవడం వలన డీహైడ్రేషన్ కాకుండా వుండటమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో చాలా ఉపయోగపడుతుంది.

 
శరీరానికి ప్రాణవాయువు ఎలా అవసరమో అదేవిధంగా శరీర చర్మానికి విటమిన్లు అవసరమవుతాయి. చర్మసౌందర్యాన్ని పెంపొందించేందుకు కొన్ని విటమిన్లు అవసరమౌతాయని స్కిన్ డాక్టర్లు అంటున్నారు. విటమిన్ సీ అన్ని రకాల పండ్లలో లభిస్తుంది. ఉదాహరణకు నారింజ, నిమ్మకాయ తీసుకుంటూ ఉండాలి.

 
విటమిన్ ఎ కలిగి వున్న బొప్పాయి, కోడిగుడ్డు తీసుకుంటూ వుండాలి. విటమిన్ బి పండ్లతోపాటు ఆకుకూరల్లోను పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ ఇ వేరుశెనగ, ఇతర నూనె గింజల్లో లభిస్తుంది. చర్మసౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కేవలం పండ్లు, ఆకుకూరలతోపాటు నీరు సేవిస్తుంటే చాలని వైద్యులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు