ఆలివ్ ఆయిల్‌ని కొద్దిగా వేడి చేసి దానితో గోళ్లను, వాటి చుట్టూ ఉండే మృదువైన చర్మాన్ని మర్దనా చేయాలి. ఇలా ప్రతిరోజూ రెండు నిమిషాలపాటు చేసుకుంటే గోళ్లు తళతళా మెరుసిపోతాయి.
వెన్నని కొద్దిగా వేడిచేసి దానితో కొన్ని నిమిషాలపాటు గోళ్లను మర్దనా చేసుకొని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే గోళ్లపై ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి.
రాత్రి పడుకునేముందు పెట్రోలియం జెల్లీ లేదా అవకాడో ఆయిల్‌తో గోళ్లకు మర్ధనా చేయాలి. దీనివల్ల గోళ్లపై మురికి, ఇతర నిర్జీవ కణాలు తొలగిపోతాయి.