టొమాటో ఆయిల్‌తో మెరుగైన సౌందర్యం..

మంగళవారం, 16 డిశెంబరు 2014 (17:10 IST)
టొమాటో ఆయిల్‌తో మెరుగైన సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. టొమాటో నూనె చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. చర్మం మృదువుగా ఉండడానికి, ప్రభావిత ప్రాంతంపై టొమాటో నూనెను మర్దన చేయండి. రాత్రంతా అలా ఉంచి, ఉదయాన్నే కడిగేయండి. టొమాటో నూనెను ఫేషియల్ క్రీములలో,  చర్మం మృదువుగా, సున్నితంగా ఉంచే స్క్రబ్‌లలో కూడా కలుపుతారు.
 
టొమాటో గుజ్జు పొక్కులు, మొటాలను తగ్గిస్తుంది. టొమాటోను సగం కోసి మీ ముఖంపై రాసి ముఖంపై ఉన్న పోక్కులను, మొటాలను పోగొట్టుకోవచ్చు. మొటాల సమస్య ఉంటే, ఒక టొమాటోను తోలుతీసి, గుజ్జుచేసి, దాన్ని చర్మంపై రాయండి. 
 
ఒక గంట అలా వదిలేయండి. ముఖంపై ఉన్న గుజ్జును కడిగేసి, తుడవండి. ఈ సహజ పాక్‌ను ఉపయోగించి మీరు మీ చర్మంపై ఉన్న మొటాలను, ఎండవల్ల వచ్చిన టాన్ నుండి ఉపశమనం పొందవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి