మాయిశ్చరైజర్‌పై మీకు అవగాహన ఉందా..?

మంగళవారం, 20 జనవరి 2015 (12:42 IST)
అమెరికాలో అరవై దాటుతున్న మహిళలు కూడా 40ల్లో ఉన్నట్లుగా అందమైన చర్మంతో మెరిసిపోతుంటారు. అదే మనదేశంలో మహిళలు చిన్న వయస్సులోనే  వయసు ఎక్కువైనట్లు కనిపిస్తుంటారు. ఇందుకు మాయిశ్చరైజర్‌పై మన దేశ మహిళలకు అవగాహన లేకపోవడం కారణమంటున్నారు.. బ్యూటీషన్లు. 
 
మాయిశ్చరైజర్లను వాడకపోవడం వల్లే మనదేశంలోని మహిళల్లో వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా దక్షిణాదిలో 40 శాతం మహిళలు మాయిశ్చరైజర్‌ని వాడరు. నిజానికి చర్మానికి సహజ సిద్ధంగానే అందాలి. కానీ చాలామందికి తగిన తేమ అందకపోవడానికి కారణం రోజులో సరిపడా నీటిని తాగకపోవడమేనని పరిశోధకులు చెబుతున్నారు. 
 
కేవలం శీతాకాలంలో మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలు అనే అపోహ చాలామందిలో ఉండవచ్చు. అయితే కేవలం ముఖానికి మాత్రమే మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోదట. మోచేతులు, మోకాళ్లు వీపు వంటి భాగాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. కొద్దిగా కోకోబటర్ తీసుకుని దానికి కాస్త వ్యాజలీన్‌తో కలిపి రాసుకుటే మంచి ఫలితాలుంటాయి.

వెబ్దునియా పై చదవండి