చలికాలంలో పాదాలు జాగ్రత్త సుమా!

శనివారం, 22 నవంబరు 2014 (19:10 IST)
చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వింటర్లో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోవాలంటే.. 
 
పాదాలను శుభ్రం ఉంచుకోవాలి. పాదాలు, వేళ్ల మధ్య ఎప్పుడు పొడిగా ఉంచుకునేలా చూసుకోవాలి. పాదాలను చల్లటి నీళ్లతో కాకుండా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజూ పాదాలకు వింటర్ క్రీమ్ వాడాలి. నెయిల్స్‌ను కట్ చేసుకోవాలి. సరైన స్లిప్పర్స్ వాడాలి. పాదాలపై వేడి నీటిని కుమ్మరించుకోకుండా.. ఉతికిన సాక్స్ వాడాలని బ్యూటీ నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి