వాతావరణం చల్లబడింది.. పెదాలు పగిలితే?

శుక్రవారం, 19 డిశెంబరు 2014 (16:17 IST)
వాతావరణం చల్లబడిందంటే పెదవులు పగలడం మొదలవుతుంది. వాటిని మళ్లీ అందంగా చేయాలంటే.. రెండు చెంచాల తేనెలో ఒక చెంచా మీగడ, నాలుగైదు చుక్కల రోజ్ వాటర్ కలిపి, రోజూ రాత్రిపూట పెదవులపై రాసుకోవాలి. 
 
నిమ్మరసంలో ధనియాల పొడి కలిపి రాసుకున్నా పగుళ్లు పోతాయి. కొత్తిమీర రసాన్నీ గానీ, బీట్‌రూట్ రసాన్ని కానీ క్రమం తప్పకుండా రాసినా మంచి ఫలితముంటుంది. 

వెబ్దునియా పై చదవండి