వింటర్ స్పెషల్ : పండ్లతో అందం.. ఫ్రూట్స్ ప్యాక్స్..

గురువారం, 18 డిశెంబరు 2014 (18:03 IST)
వింటర్లో పండ్లతోనూ అందాన్ని కాపాడుకోవచ్చు. అరకప్పు బొప్పాయి గుజ్జులో చెంచా గులాబీరేకుల మిశ్రమం, చెంచా తేనె కలుపుకోవాలి. దీన్ని కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి తర్వాత ముఖానికి పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ముఖం తాజాగా మారుతుంది. 
 
అలాగే అరటి పండు, కీరదోసను కలిపి మెత్తగా చేసుకుని దానికి కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా తేనె జతచేసి ఆ మిశ్రమాన్ని ఫేస్‌ప్యాక్ వేయాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న ముడతలు కనిపించకుండా ఉంటాయ. 
 
అలాగే అరకప్పు కమలాఫలం రసంలో చెంచా చొప్పున పెసర పిండీ, ముల్తానీమట్టి, వెన్న కలుపుకొని దాంతో ముఖ, మెడ ప్రాంతాల్లో పూతలా వేసుకోవాలి, ఆరాక కడుక్కుంటే సరిపోతుంది. 

వెబ్దునియా పై చదవండి