స్వతంత్ర భారతావనిలో ఇదో చారిత్రాత్మక ఘట్టం : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

మంగళవారం, 31 జనవరి 2017 (11:28 IST)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తూ... స్వతంత్ర భారతావనిలో తొలిసారిగా సాధారణ బడ్జెట్‌తో కలిపి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడాన్ని మారుతున్న చరిత్ర, అభివృద్ధికి సూచికగా అభివర్ణించారు. 
 
దేశ చరిత్రలో ఈ బడ్జెట్ సమావేశాలు ఓ కొత్త చరిత్రను లిఖించనున్నాయని ఆయన అన్నారు. 'సబ్ కే సాథ్... సబ్ కా వికాస్' నినాదంతో దేశం ముందడుగు వేస్తోందని కొనియాడారు. "సహనా వవతు సహనౌ భునక్తు..." సూక్తాన్ని తన ప్రారంభ ప్రసంగంలో చదివి వినిపించారు. 
 
బ్లాక్ మనీ అవినీతిపై పోరాటంలో పేదలు చూపిన స్ఫూర్తి ప్రశంసనీయమని కొనియాడారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు 1.20 కోట్ల మంది గ్యాస్ సబ్సీడీని వదులుకోవడం హర్షణీయమన్నారు. స్వచ్ఛ భారత్ కింద దేశ వ్యాప్తంగా 3 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్టు రాష్ట్రపతి తన ప్రసంగంలో గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి