వలసలు తగ్గిన గల్ఫ్ ఉద్యోగార్థుల సంఖ్య...!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం కారణంగా ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారి సంఖ్య దాదాపు 30 శాతం మేరకు తగ్గిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మాంద్యం కారణంగా అమెరికా, బ్రిటన్ దేశాలతోపాటు గల్ఫ్ దేశాలలో కూడా ఉద్యాగాల సంఖ్య బాగా పడిపోయింది. దీంతో పశ్చిమాసియా దేశాలకు వెళ్ళేవారి సంఖ్య దాదాపు 30 శాతం పడిపోయిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం తెలిపింది.

వర్కింగ్ వీసాలపై విదేశాలకు వెళ్ళే భారతీయ నిరుద్యోగులు ఇతర దేశాలకు వెళ్ళేందుకు ఆసక్తి కనబరచడం లేదని అధికారులు తెలిపారు.

గత ఏడు సంవత్సరాలలో పలు రంగాలలో పనిచేసేందుకు దాదాపు 3.80 లక్షల మంది కార్మికులు ఇతర దేశాలకు వెళ్ళారని, నిరుడు ఇదే కాలానికి ఈ సంఖ్య 8.40 లక్షలకు చేరుకుందని వారు పేర్కొన్నారు.

ఇదిలావుండగా మాంద్యం కారణంగా పశ్చిమాసియా దేశాలకు వెళ్ళేవారి సంఖ్య దాదాపు 30 శాతం మేరకు పడిపోయినట్లు మంత్రిత్వశాఖ కార్యాలయం తెలిపింది.

వెబ్దునియా పై చదవండి