అమెరికా ఉత్పత్తులను నిషేధించిన బ్రెజిల్

బుధవారం, 10 మార్చి 2010 (13:42 IST)
అమెరికా ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు బ్రెజిల్ ప్రకటించింది. పత్తిపై ఇస్తున్న రాయితీని అమెరికా దేశం తొలగించడంతో తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రెజిల్ అభిప్రాయపడింది.

బ్రెజిల్ ప్రభుత్వం నిషేధించిన అమెరికా ఉత్పత్తుల్లో తాజా పండ్లతోపాటు కంటి అద్దాలు కూడా ఉండటం గమనార్హం. అమెరికాకు చెందిన ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు రూపొందించిన వస్తువుల జాబితాను జెనీవాలోనున్న డబ్ల్యూటీఓ కార్యాలయంలో బ్రెజిల్ ప్రభుత్వం అందజేసింది.

తమ ప్రభుత్వం నిషేధం విధించిన అమెరికా ఉత్పత్తులపై తమకు చాలా బాధగా ఉందని బ్రెజిల్ ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాపార లావాదేవీలలో అంతర్జాతీయ స్థాయి వ్యాపార లావాదేవీలను అమెరికా పాటించలేదని బ్రెజిల్ ఆ ప్రకటనలో వివరించింది. దీంతో తమ ప్రభుత్వం అమెరికా ఉత్పత్తులను నిషేధించాల్సి వచ్చిందని బ్రెజిల్ ప్రభుత్వ వర్గాలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.

ఇదిలావుండగా బ్రెజిల్ నిషేధించిన అమెరికా ఉత్పత్తులపై అమెరికా స్పందించింది. ఈ సందర్భంగా అమెరికాలోని ఆఫీస్ ఆఫ్ ది యూఎస్ ట్రేడ్ రెప్రజెంటేటివ్ ప్రతినిధి నేఫేతేరియస్ మైక్ఫర్సన్ మాట్లాడుతూ బ్రెజిల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తమకు బాధకలుగజేసిందన్నారు. దీనిపై తమ ప్రభుత్వం బ్రెజిల్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వ్యాపార లావాదేవీలలో తిరిగి యథాస్థితిని తీసుకువస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి