ఆశాజనకంగా వృద్ధి చెందుతున్న పర్యాటక రంగం

శనివారం, 5 జులై 2008 (12:40 IST)
ప్రపంచ పర్యాటక రంగం ఆశాజనకంగా వృద్ధి చెందుతోంది. భద్రతాపరమైన సమస్యలు ఓ వైపు.... అలాగే మండుతున్న చమురు ధరలు ఓ వైపు వెరసి పర్యాటక రంగ అభివృద్ధికి గండి కొడుతున్నప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆశాజనకమైన ఫలితాలు వెల్లడికావడం విశేషమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

అమెరికా ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) అంచనాల విశ్లేషణల ప్రకారం గత ఏడాది కన్నా ఈ ఏడాది ఏప్రిల్ వరకు చూస్తే పర్యాటక రంగం ఓ మోస్తరుగా... అంటే ఐదు శాతం మేర వృద్ధి చెందినట్లు తెలిసింది. యూఎన్‌డబ్ల్యూటీఓ ప్రధాన కార్యదర్శి విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడం.. దీంతో నిత్యావసర వస్తువులతో సహా అన్ని రకాలైన ఉత్పత్తులపైనా దాని ప్రభావం పడింది.

అలాగే ప్రపంచ పర్యాటకరంగంపైన దాని ప్రభావం పడినప్పటికీ వృద్ధి బాటలోనే పర్యాటకరంగం పయనిస్తోందని స్పష్టం చేశారు. దక్షిణాసియా, దక్షిణ అమెరికా తదితర దేశాల్లో మేలు ఫలితాలు వచ్చాయన్నారు. ఇంకా జపాన్, ఇండోనేషియా, చైనా, స్వీడన్, జమైకా, బల్గేరియా, ఈజిప్టు, టర్కీ తదితర దేశాలు కూడా పర్యాటక రంగంలో ముందంజలో ఉన్నాయని వివరించారు.

వెబ్దునియా పై చదవండి