ఆసియాలో వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు: బార్‌క్లేస్

యూకేకు చెందిన ప్రైవేట్ బ్యాంకింగ్ రంగమైన బార్‌క్లేస్ సంస్థ ఆసియా ఖండంలో తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఆసియా మొత్తం తమ సంస్థకు చెందిన వ్యాపార లావాదేవీలను మెరుగుపరచుకునేందుకు తాము ప్రణాళికలు రూపొందించుకున్నామని, అది 10 శాతం మేరకు అభివృద్ధి చేసుకునేందుకు దోహదపడుతుందని బార్‌క్లేస్ సంస్థ ఛైర్మెన్, ప్రధాన కార్యనిర్వహణాధికారి రాబర్ట్ ఏ మోర్రైస్ సోమవారం విలేకరులకు చెప్పారు.

తమ సంస్థకు చెందిన వ్యాపార లావాదేవీలకుగాను ఆసియా ఎంతో మెరుగైన ప్రాంతంగా తాము గుర్తించామని, దీంతో తమ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని ఆయన వెల్లడించారు.

ముఖ్యంగా భారతదేశంలో తమ వ్యాపారం సజావుగా సాగుతోందని, దీనిని మరింత అభివృద్ధి పరచి తమ వినియోగదారులకు మరిన్ని విలువైన సేవలను అందిస్తామని, గత ఐదు సంవత్సరాలుగా తమ కార్యకలాపాలు మెరుగైనాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా భారతీయులు తమ పెట్టుబడులను ఈక్విటీ షేర్లలో పెట్టుబడులు పెడతారని, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ల్ లించ్ కౌంటీ ప్రధాన్ కెవాన్ వి వాట్స్ అన్నారు.

భారతీయులు తమ పెట్టుబడులను స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లలో పెట్టుబడులు పెడతారని, అలాగే తాము గ్రామీణ వ్యాపార మార్కెట్లపై కూడా దృష్టి సారిస్తామని ఆయన వెల్లడించారు. కాగా రానున్న రోజుల్లో డాలర్ మరింత మెరుగవ్వగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి