ఆస్ట్రేలియాలోని గోర్గాన్ ప్రాజెక్టుతో పెట్రోనెట్ ఒప్పందం

భారత్‌లో అతిపెద్ద ద్రవీకృత సహజవాయువు దిగుమతిదారు (ఎల్ఎన్‌జీ) "పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ లిమిటెడ్" ఆస్ట్రేలియాలోని గోర్గాన్ ప్రాజెక్టు నుంచి ఇంధన దిగుమతి కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు నుంచి పెట్రోనెట్ ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీని దిగుమతి చేసుకోనుంది.

ఎక్సొన్ మొబిల్ కార్పొరేషన్ నుంచి 20 ఏళ్లపాటు ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్‌జీని దిగుమతి చేసుకునేందుకు అవసరమైన అన్ని ఒప్పందాలను పెట్రోనెట్ ఖరారు చేసుకుందని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ప్రసాద్ దాస్‌‍గుప్తా పీటీఐతో చెప్పారు.

గ్యాస్ అమ్మకాలు, కొనుగోలు ఒప్పందం (జీఎస్‌పీఏ)పై జూన్ 30లోగా సంతకాలు చేస్తామని తెలిపారు. కేరళలో నిర్మాణంలో ఉన్న కోచి టెర్నినల్ నుంచి పెట్రోనెట్ ఎల్ఎన్‌జీని దిగుమతి చేసుకోనుంది.

వెబ్దునియా పై చదవండి