ఉద్యోగులను తొలగించనున్న జెట్‌ ఎయిర్‌వేస్‌

FILE
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్న పరిస్థితుల్లో దేశీయ విమానయాన సంస్థలపై రోకటి పోటులాగా మారి పెరిగిన ఇంధన భారం మరింత కుంగదీస్తోంది. ఈ సమస్యల నుంచి బయ టపడేందుకు పలు విమానయాన సంస్థలు ఉద్యోగులను తొలగించేందుకు సిద్దమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో భాగంగా జెట్‌ ఎయిర్‌‍‌‍‌‌వేస్‌ సంస్థ రానున్న ఆరు నెలల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం క్యాంపస్‌ సెలక్షన్లను నిలిపేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. కాంట్రాక్టు పద్దతిపైనే ఇతర ఉద్యోగులను తీసుకుంటున్నట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ఎయిర్‌లైన్స్‌లో రేషనలైజేషన్‌ను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

దేశీయ విమానయాన సంస్థలు ఆర్థిక మాంద్యంతో నానాటికి పెరుగుతున్న ఇంధనం ధరలు, మరోవైపు తగ్గుతున్న ప్రయాణీకుల సంఖ్య, తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటితోపాటు అన్నింటికీ మించి పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతన్న ఆదాయాలు వీటిని మరింత కుంగదీస్తున్నాయని ఆయన వివరించారు.

వెబ్దునియా పై చదవండి