ఎయిర్ ఇండియాలో సీనియర్ పైలట్ల కొరత

సోమవారం, 10 మే 2010 (09:50 IST)
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో సీనియర్ పైలట్ల కొరత ఏర్పడింది. గత నెలల కాల వ్యవధిలో సుమారు 25 శాతం మంది పైలట్లు ఎయిర్ ఇండియా నుంచి తప్పుకున్నారు. దీంతో పైలట్ల కొరత ఏర్పడినట్టు ఆ సంస్థ సీనియర్ అధికారులు చెపుతున్నారు.

గత యేడాది కాలంలో ఎయిర్ ఇండియాలో ఉన్న 102 మంది సీనియర్ పైలట్లలో 26 మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. 21 ఎయిర్ క్రాఫ్ట్‌లకు 76 మంది సీనియర్ పైలట్లు ఉన్నారన్నారు.

ఉద్యోగాల నుంచి తప్పుకున్న 26 మంది పైలట్లు కాంట్రాక్టులు ముగిసిపోవడం లేదా తమ ఉద్యోగాలకు స్వస్తి చెప్పడం జరిగింది. అయితే, ఎక్కువ మంది పైలట్లు మాత్రం ఎయిర్ ఇండియా ఉన్నతాధికారుల అజమాయిషీని భరించలేక రాజీనామాలు చేసినట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి