ఐటీ ఇంజనీర్ల అవకాశాలకు గండి కొడుతున్న సైన్స్ గ్రాడ్యుయేట్లు

భారత ఐటీ పరిశ్రమకు సంబంధించి ఇంజనీరింగ్ పట్టభద్రులకు డిమాండ్ తగ్గుతోందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి మందగించడం, ఐటీ కంపెనీల వ్యాపార సేవల్లో మార్పులు, విదేశాల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వాల్సి రావడం, సైన్స్ పట్టభద్రులు తక్కువ వేతనాలకే ఉద్యోగాల్లో చేరడం దీనికి కారణాలని ఈ నివేదికలో తెలిపింది.

ఈ పరిస్థితులు ఐటీ రంగంలో వేతనాల స్తబ్ధతకు దారి తీయవచ్చని పేర్కొంది. అంతేకాకుండా ఇంజనీరింగ్ పట్టభద్రులు తాము చదువుకున్న చదువు కంటే తక్కువ స్థాయి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులు కూడా రావచ్చని ఈ సంస్థ అంచనా వేస్తోంది.

వెబ్దునియా పై చదవండి