గోవాలో పునఃప్రారంభం కానున్న కాల్ సెంటర్ : శాంతారామ్

గోవాలో కొంత కాలంగా మూసివేయబడి ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్ దూరప్రసారాల సంస్థ (టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్) కాల్ సెంటర్‌ను త్వరలో మళ్లీ పునఃప్రారంబంచనున్నట్లు గోవా రాజ్యసభ సభ్యుడు శాంతారామ్ నాయక్ తెలిపారు.

దక్షిణ గోవాలోని మార్గావ్‌లో జరిగిన బిఎస్‌ఎన్‌ఎల్ 3జీ సర్వీసుల ప్రారంభోత్సవంలో నాయక్ మాట్లాడుతూ కాల్ సెంటర్‌ కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నామని, విజయవంతంగా టెండరు దక్కించుకున్న సంస్థ స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, ఎందుకంటే స్థానికులు ల్యాండ్‌లైన్ మరియు మొబైల్ సర్వీసులను సమర్థవంతంగా వినియోగించగలరని ఆయన తెలిపారు.

3జీ సర్వీసు కలిగయున్న మొబైల్ ఫోన్లలో 11 టి.వి. ఛానెళ్ళు ఉందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎన్‌డిటివి, బిబిసీ, నేషనల్ దూరదర్షన్, దూరదర్షన్ న్యూస్, ఉత్సవ్‌లతో పాటు సినిమాలు, సంగీతం, ఆటలు వంటివి చాలా త్వరగా సమాచారాన్ని బదిలీచేసుకోవచ్చు.

అంతేకాకుండా త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే ఉత్సవాలను, అలాగే గోవాలోని వెళాంగిని చర్చి వేడుకలను ప్రత్యక్షంగా మొబైల్ ఫోన్‌లో వీక్షించేదుకు 3జీ చందాదారులకు వీలు కలిపిస్తామని నాయక్ పేర్కొన్నారు.

దక్షిణ గోవా లోక్ సభ సభ్యుడు ఫ్రాన్సిస్కో సర్ధినాహ్ మాట్లాడుతూ రాష్టంలోని కొన్ని ప్రాంతాలలో బిఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ సర్వీస్ సిగ్నల్స్‌పై దృష్టి సారించాలని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి