చెన్నై, కొచ్చిలలో రద్దైన జెట్ విమానాలు

FILE
జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన పైలెట్లు సమ్మె చేయడంతో తమిళనాడులో ఎనిమిది విమానాలను అధికారులు రద్దు చేశారు.

దేశవ్యాప్తంగా జెట్ ఎయిర్‌వేస్ పైలెట్లు చేస్తున్న సమ్మె కారణంగా మూడోరోజుకూడా సంస్థకు చెందిన విమానాలు ప్రయాణానికి నోచుకోలేదు.

కొచ్చినుంచి బయలు దేరాల్సిన రెండు విమానాలలో ఒకటి విదేశానికి ప్రయాణించాల్సి ఉంది. మరోటి దేశీయంగా ప్రయాణించాల్సి ఉంది. దీంతో దాదాపు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విమానాశ్రాయాధికారులు తెలిపారు.

ఈ ప్రయాణీకులలో రాహుల్ భద్రత నిమిత్తం వచ్చిన దాదాపు ఇరవై మంది భద్రతాధికారులున్నారని అధికారులు తెలిపారు. వీరు మరో విమానం ద్వారా తమ ప్రాంతాలకు బయలుదేరారని వారు పేర్కొన్నారు.

గత రెండు రోజులుగా జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన పైలెట్లు సామూహిక సెలవులపై తమ నిరసనను తెలుపుతు సమ్మె చేస్తున్న విషయం విదితమే.

వెబ్దునియా పై చదవండి