జూన్‌లో భారత మార్కెట్‌లోకి ఆడి క్యూ5 కారు

ఆదివారం, 8 మార్చి 2009 (15:01 IST)
జర్మనీకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ ఆడీ కొత్త కారు క్యూ5 ఈ ఏడాది జూన్‌లో భారత మార్కెట్లోకి విడుదల కానుంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోను క్రీడా పరికరాల వాహనమైన (ఎస్‌యూవీ) ఈ తాజా ఆడి క్యూ5 కారును విడుదల చేస్తుండటం విశేషమని కంపెనీ వెల్లడించింది.

భారత్‌లో ఎస్‌యూవీ శ్రేణిలో ఇప్పటి వరకు క్యూ7 ఆడికారు మాత్రమే ఉందని, అయితే ఈ మోడల్ కన్నా చిన్నది కావాలని వినియోగదారులు కోరడంతో తాము క్యూ5ను విడుదల చేయనున్నామని ఆడి సంస్థ ప్రతినిధి విలేకరులకు వెల్లడించారు. ఈ మోడల్ కారు ఇప్పటికే యూరప్‌లో నవంబర్ 2008లో విడుదల చేశామన్నారు.

నాలుగు వెర్షన్‌లలో లభ్యమయ్యే ఈ కారు పెట్రోల్, డీజల్ ఇంజిన్‌లను కలిగి ఉంటుంది చెప్పారు. జర్మనీలో దీని ధర 38వేల యూరోలు నుండి 50వేల యూరోల వరకు ఉంటుందన్నారు. భారత్‌లో దీనిని రెండు వెర్షన్‌లలో తొలుత విడుదల చేస్తామన్నారు.

వెబ్దునియా పై చదవండి