దుబాయ్‌లో ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ కేంద్రం

గల్ఫ్ సెక్టార్‌లో విమాన రాకపోకలను పర్యవేక్షించేందుకు వీలుగా దుబాయ్‌లో ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఎయిర్ ఇండియా ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ అరవింద్ జాధవ్ వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ విమానాల్లో ఆకస్మికంగా తలెత్తే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఐదు ఎయిర్‌క్రాఫ్ట్‌లను ప్రత్యామ్నాయంగా ఉంచుతామన్నారు.

అలాగే, తాము ఏర్పాటు చేయబోయే ఇంజనీరింగ్ కేంద్రం ఖర్చును పరిగణనలోకి తీసుకుని దుబాయ్ లేదా షార్జాలలో ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఐదు ఎయిర్‌క్రాఫ్టులను లీజ్‌కు తీసుకుంటామన్నారు. అలాగే, 24 గంటల పాటు పని చేసే టోల్‌ఫ్రీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి