పదవికి మాంటెక్ సింగ్ అహ్లువాలియా రాజీనామా!

ఆదివారం, 18 మే 2014 (15:22 IST)
File
FILE
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రణాళికా సంఘంలోని ఇతర సభ్యులూ ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు. మొదటగా అహ్లూవాలియా మాత్రం శనివారం ఇక్కడ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు తన రాజీనామా సమర్పించారు.

ప్రణాళికా సంఘంలో సభ్యుడిగా ఉన్న బీకే చతుర్వేది కూడా తన రాజీనామాను ఇచ్చారు. ఉపాధ్యక్షుడు తన రాజీనామాను ఇచ్చారు. మిగతా సభ్యుల గురించి నాకు తెలియదు. నేను కూడా ఈ ఉదయం ప్రణాళికా సంఘంలో సభ్యత్వానికి రాజీనామా చేశాను అని చతుర్వేది పీటీఐ వార్తా సంస్థకు సమాచారం అందించారు.

వెబ్దునియా పై చదవండి