పాక్-ఆప్ఘన్ వాణిజ్య ఒప్పందాలూ కీలకమే: వైట్‌హౌస్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చే నవంబరులో చేపట్టే భారత పర్యటనలో పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ దౌత్య సంబంధాలతో పాటు.. వాణిజ్య ఒప్పందాలు సైతం కీలకమేనని వైట్‌హౌస్ అభిప్రాయపడింది. దీనిపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటీ రాబర్ట్ గిబ్స్‌కు మాట్లాడుతూ.. ఒబామా చేపట్టే న్యూఢిల్లీ పర్యటనలో ప్రపంచ ఆర్థిక వ్యవహారాలతో పాటు భారత్‌తో దౌత్య వాణిజ్య సంబంధాలు అతి ముఖ్యమైనవన్నారు.

ఇకపోతే భద్రతాపరంగా ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లలో పరిస్థిత్ అధ్వాన్నంగానే ఉందని, అయినప్పటికీ ఇదంతా ఆసియా అంతర్గత వ్యవహారమన్నారు. ప్రధానంగా ఒబామా తన పర్యటనలో భారత్‌తో స్నేహ సంబంధాల పటిష్టత కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని రాబర్ట్ గిబ్స్ అన్నారు.

వెబ్దునియా పై చదవండి