పెట్రోల్ ధరలు పెంచక తప్పదు: మంత్రి జైపాల్ రెడ్డి

పెట్రోల్ ధరల పెంపు అనివార్యమని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి ఎస్.జైపాల్ రెడ్డి అన్నారు. ఈ ధరల పెంపు తమ చేతుల్లో ఏమీలేదని ఆయన చేతులెత్తేశారు. ఈనెల 16వ తేదీన మరోమారు పెట్రోల్ ధర లీటరుకు యాభై పైసలు చొప్పున పెరగవచ్చని వస్తున్న వార్తలపై మంత్రి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. ఈ ధరలు మున్ముందు కూడా తగ్గే సూచనలు కనిపించడం లేదన్నారు. అందువల్ల ధరల పెంపు అనివార్యమన్నారు. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు ఒక రోజుకు 400 కోట్ల రూపాయల మేరకు నష్టపోతున్నాయన్నారు.

దేశ అవసరాల కోసం విదేశాల నుంచి 80 శాతం చమురును దిగుమతి చేసుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. అందువల్ల పెట్రోల్ ధర పెంపు తమ చేతుల్లో ఏమీ లేదని మంత్రి జైపాల్ రెడ్డి పరోక్షంగా ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి