పెరిగిన గృహ వినియోగ వస్తువుల ధరలు

FILE
గృహ వినియోగ వస్తువుల ధరలు 29 ఆగస్టుతో ముగిసిన వారాంతానికి దాదాపు 0.12శాతం పెరిగింది. అదే గత వారంలో వీటి ధరలు 0.21 శాతంకన్నా తక్కువగానే ఉండింది.

నిత్యావసర సరుకుల ధరలు గత 13 వారాలకన్నా కిందనే ఉన్నాయి. జూన్ నెల ఆరవ తేదీకి తొలిసారి ధరలు శూన్యం కన్నా తక్కువ స్థాయికి చేరుకుంది. నిరుడు ఇదే వారానికి ధరల స్థితి 12.38 శాతంగా ఉండింది.

ప్రస్తుత వారంలో పండ్లు, కూరగాయలు మరియు పాల ధరల్లో ఒక శాతం పెరిగింది. అదే కోడిగ్రుడ్ల ధరలు నాలుగు శాతానికి పెరిగాయి. సముద్రపు చేపలు రెండు శాతం మరియు సోయాబీన్ నూనె మూడు శాతానికి పెరిగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

గృహ వినియోగ వస్తువుల్లో వాషింగ్ సోప్ ధరలు 35 శాతం పెరిగింది. అదే డిటర్జెంట్ పౌడర్ ధరల్లో 17 శాతం పెరిగింది. టాయిలెట్ సోప్ మరియు టూత్‌పేస్ట్ ధరలు వరుసగా ఆరు శాతం వృద్ధి జరిగింది.

వెబ్దునియా పై చదవండి