ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటి: ముకేశ్ అంబానీ

సోమవారం, 8 ఫిబ్రవరి 2010 (13:29 IST)
FILE
వచ్చే ఐదు దశాబ్దాల కాలంలో ప్రపంచంలోని ప్రధానమైన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటిగా నిలుస్తుందని రిల్ అధినేత ముకేశ్ అభిప్రాయపడ్డారు.

రానున్న ఐదు దశాబ్దాలలో ప్రపంచంలోని ఐదు ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటిగా నిలుస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ముంబైలో సోమవారం మీడియాకు తెలిపారు. తమ సంస్థను ప్రపంచ మార్కెట్లోకి విస్తరింపజేసేందుకు ముందుగా దేశీయ మార్కట్లో మరింతగా పటిష్టపరిచేందుకు తాము ప్రణాళికలు రూపొందించుకున్నామన్నారు.

ముంబైలో సోమవారం భారతీయ స్టేట్ బ్యాంక్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముకేశ్ మాట్లాడుతూ మన దేశం ప్రపంచంలోని ఐదు ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశీయ కంపెనీలు తమ వ్యాపారాలను ప్రపంచ మార్కెట్లోకి విస్తరింపజేసుకునే ముందు దేశీయ మార్కెట్లో స్థిరంగా వ్యాపార కార్యకలాపాలు కొనసాగేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు.

వెబ్దునియా పై చదవండి