బంగారం ధరలు మరింత పైపైకి

ప్రపంచ మార్కెట్‌లో డాలర్ విలువ బలహీనపడటంతో అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్లో బంగారం ధరల్లో మార్పులు సంభవించాయి.

బంగారం ప్రతి ఔన్స్ 1036.40 డాలర్ల స్థాయికి చేరుకుంది. దీంతో దేశంలో బుధవారం నాడు ఉదయం బంగారం ధరలు ప్రతి పది గ్రాములు రూ. 15768లకు చేరుకుంది.

లండన్‌లోని గోల్డ్ ఫ్యూచర్స్ ధర వారం ప్రారంభపు రోజైన సోమవారం నాడు బంగారం ప్రతి ఔన్సు 1016.65 డాలర్ల వద్ద ప్రారంభమై 1032.05 డాలర్లకు చేరుకుంది. అమెరికాలోని కోమేక్స్ మార్కెట్లో డిసెంబర్ డెలివరీకి సిద్ధంగా ఉన్న బంగారం ధరలు ప్రతి ఔన్సు 1038.00 డాలర్లకు చేరుకుంది.

ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడులుగా భావిస్తున్నారని, దీంతో బంగారం ధరలు పెరుగుతున్నా కొనడానికి చాలామంది ముందుకు వస్తున్నారని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇదిలావుండగా డాలర్ విలువ మరింత పతనమైతే బంగారం ధర మరింత ఎగబడే ప్రమాదం ఉందని వ్యాపార వర్గాలు చెపుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి