భారత్‌కు యురేనియం సరఫరా నిలిపివేస్తాం: ఆస్ట్రేలియా

మంగళవారం, 6 ఏప్రియల్ 2010 (13:18 IST)
భారతదేశానికి యురేనియం సరఫరాను నిలిపివేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆస్ట్ర్లేలియా వాణిజ్య శాఖామంత్రి సైమన్ క్రీన్ క్యాన్‌బెర్రాలో మంగళవారం మీడియాకు తెలిపారు.

తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. జాన్ హౌవార్డ్ నేతృత్వంలో ఆగస్టు 2007లో అప్పటి ప్రభుత్వం భారతదేశానికి యురేనియం అమ్మేందుకు నిర్ణయించింది.

కాని అమెరికా-భారత్ ఇరు దేశాలు అణు ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో తాము భారతదేశానికి యురేనియం అమ్మకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి