భారత్‌లో వచ్చే 2020 నాటికి 3.75 కోట్ల ఉద్యోగాలు

భారత్‌లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగానే ఉద్యోగ అవకాశాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. భారత్‌ పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు క్యూ కట్టడంతో ఈ అవకాశాలు మున్ముందు మరిన్ని పెరగనున్నాయి. భారత్‌ను అపారమైన వనరులు ఉన్న మార్కట్‌గా విదేశీ కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో మౌలిక వసతులు, నైపుణ్యాల కల్పన రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

భారత్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, వాటివల్ల అందుబాటులోకి వచ్చి ఉద్యోగాలపై గ్లోబల్ కన్సల్టింగ్ యాక్సెంచర్ ఒక నివేదికను తయారు చేసింది. ఇందులో భారత్‌లో యేటా 8.7 ఆర్థిక వృద్ధిరేటు నమోదు కానున్నట్టు తేల్చింది. దీనివల్ల వచ్చే 2020 నాటికి 3.75 కోట్ల ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి