భారత్ ఎఫ్‌డీఐ సంస్కరణలు భేష్: అమెరికా

శనివారం, 20 జులై 2013 (10:36 IST)
టెలికం, బీమా సహా పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితులు పెంచుతూ భారత్ తీసుకున్న నిర్ణయాలను అమెరికా స్వాగతించింది. భారత్‌లో అమెరికా మరింత గా పెట్టుబడులు పెట్టే దిశగా ఇది సరైన నిర్ణయమని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జో బెడైన్ ఈ నెల 22 నుంచి నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అమెరికా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించకున్నాయి. భారత రిటైల్ రంగాన్ని అభివృద్ధిపర్చడంలో, అంతర్జాతీయ సంస్థలు నిర్మాణాత్మక పాత్ర పోషించగలవని ఆ అధికారి పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి