మలేషియాలో మహీంద్రా సత్యం కార్యకలాపాలు

బుధవారం, 2 డిశెంబరు 2009 (13:15 IST)
తమ సంస్థను మలేషియాలోను ప్రారంభించనున్నట్లు మహీంద్రా సత్యం బుధవారం వెల్లడించింది.

తమ కంపెనీ కార్యకలాపాలను విదేశాలలోనూ విస్తరింపజేసేందుకుగాను మలేషియా దేశంలోను కంపెనీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నామని మహీంద్రా సత్యం ఓ ప్రకటనలో తెలిపింది.

విదేశీ విస్తరణలో భాగంగా మలేషియాలో గ్లోబెల్ సొల్యూషన్ సెంటర్ (జిఎస్‌సి) ను ప్రారంభించడంతో గ్లోబెల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డెలివరీ ఆపరేషన్స్‌ను చేపట్టనున్నామని, దీంతో కంపెనీ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు వీలు కలుగుతుందని కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది.

ప్రస్తుతం అక్కడ దాదాపు 500 మంది పూర్తి స్థాయి ఇంజనీర్లతో సైబర్‌జయలో ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ బ్లాకులు 18, సీట్‌ డెవలప్‌మెంట్ బ్లాకులు 1100, 1100 సర్వర్ల డేటా సెంటర్‌గా తమ సంస్థ కార్యకలాపాలను కొనసాగిస్తోందని కంపెనీ తెలిపింది.

మలేషియాలో జిఎస్‌సి కేంద్రం ప్రారంభించడంతో రిమోట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ ఔట్ సోర్సింగ్, బిజినెస్ ప్రోసెసింగ్ ఔట్ సోర్స్, సాఫ్ట్‌వేర్ సర్వీసులతో పాటు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌పై తాము దృష్టి పెట్టనున్నామని కంపెనీ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి