మళ్ళీ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు

File
FILE
గత కొంత కాలంగా పసిడి రేట్లు తగ్గి పురోగమనం సాధిస్తున్న తరుణంలో మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లలో గురువారం బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. దేశ ప్రధాన నగరాల స్పాట్ మార్కెట్లలో రేట్లు తగ్గాయి. ముంబై ప్రధాన మార్కెట్ విషయానికి వస్తే, 24, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.245 చొప్పున తగ్గి వరుసగా రూ.27,040, రూ.26,905కు చేరాయి.

ఇక వెండి కేజీ ధర రూ.785 తగ్గి, రూ.45,540కు పడింది. న్యూఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ బులియన్ మార్కెట్లలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. అమెరికా, చైనాలలో తయారీ రంగం వృద్ధి రేటు బాగుండకపోవడం, అమెరికా ఉద్దీపనల కొనసాగింపుపై కొనసాగుతున్న అనిశ్చితి బంగారం తాజా పతనానికి కారణం.

వెబ్దునియా పై చదవండి