మార్చిలో ప్రారంభం కానున్న అల్ మక్తూమ్ విమానాశ్రయం

శనివారం, 5 జూన్ 2010 (14:13 IST)
FILE
వచ్చే ఏడాది మార్చి నెలలో దుబాయ్‌లోని నూతన విమానాశ్రయం అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంకానుందని దుబాయ్ వరల్డ్ సెంట్రల్ ఉపాధ్యక్షుడు ఆండ్రూ వాల్ష్ శనివారం దుబాయ్‌లో తెలిపారు.

తాము ప్రారంభించదలచుకున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి 33 బిలియన్ డాలర్ల మేరకు ఖర్చుపెట్టినట్లు ఆయన తెలిపారు. తొలుత జూన్ 27న కార్గో విమానాలను నడిపేందుకు ప్రారంభించనున్నామని, అధికారికంగా అంతర్జాతీయస్థాయిలో వచ్చే ఏడాది మార్చి చివరినాటికి ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం ప్రయాణీకులు ప్రయాణించేందుకు వీలుగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తవుతయ్యాయని, కార్గో విమానాల టెర్మినల్ నిర్మాణం పూర్తయితే వచ్చే ఏడాది లాంఛనంగా ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి