ముడి చమురు ఉత్పత్తిని పెంచనున్న యూఏఈ

శనివారం, 2 జనవరి 2010 (16:25 IST)
సంయుక్త అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వచ్చే 2014 నాటికి ముడి చమురు ఉత్పత్తులను పెంచనుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) ఆశాభావం వ్యక్తం చేసింది.

2014 నాటికి యూఏఈ ముడిచమురు ఉత్పత్తులను పెంచనుందని, అక్కడ ప్రస్తుతం ముడి చమురు ప్రతి రోజు 27.2 లక్షల బ్యారెళ్ళ ఉత్పత్తి జరుగుతోందని ఐఈఏ తెలిపింది. 2010లో యూఏఈలో ముడి చమురు ఉత్పత్తులు తగ్గి ప్రతి రోజు 27.1 లక్షల బ్యారెళ్ళుగా ఉంటుంది. కాని 2011లో ఈ ఉత్పత్తి పెరిగి ప్రతి రోజు 27.5 లక్షల బ్యారెళ్ళ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుంటుందని ఐఈఏ పేర్కొంది.

అదే 2012లో ముడి చమురు ఉత్పత్తిలో యూఏఈ ప్రతి రోజు 28.8 లక్షల బ్యరెళ్ళ ఉత్పత్తిని పెంచుకుని 2013 నాటికి 29.9 లక్షల బ్యారెళ్ళకు చేరుకుంటుందని ఐఈఏ ఆశాభావం వ్యక్తం చేసింది. నిరుడు నవంబర్‌ నెలలో యూఏఈకి చెందిన ముడి చమురు ఉత్పత్తి సామర్థ్యం ప్రతి రోజు 22.7 లక్షల బ్యారెల్ళుగా ఉండింది. అదే అక్టోబరు నెలలో ఇది 22.8 లక్షల బ్యారెళ్ళుగా ఉండిందని ఐఈఏ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి