వచ్చే రెండేళ్ళల్లో బజాజ్ రెనాల్ట్ కారు : రాజీవ్ బజాజ్

గురువారం, 6 మే 2010 (12:29 IST)
FILE
బజాజ్ ఆటో సంస్థ వచ్చే రెండు సంవత్సరాల్లో రెనాల్ట్ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకుందని, దీంతో తాము టాటాకు చెందిన నానోకు గట్టి పోటీనివ్వగలమని బజాజ్ ఆటో కార్యనిర్వహాక డైరెక్టర్ రాజీవ్ బజాజ్ న్యూ ఢిల్లీలో మీడియాకు తెలిపారు.

తాము నిస్సాన్ సంస్థతో కలిసి సంయుక్తంగా రూపొందిస్తున్న రెనాల్ట్ కారు ధర దాదాపు 2,500 డాలర్ల మేరకు ఉంటుందని ఆయన అన్నారు. తక్కువ ఇంధనంతో ఎక్కువ మైలేజీని ఇవ్వగలిగిన కారు తమదేనని ఆయన అన్నారు. ప్రజలు ద్విచక్ర వాహనాలను వదిలి కార్లను ఉపయోగిస్తే తప్పనిసరిగా తమ సంస్థకు చెందిన కార్లనే ఉపయోగిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే తమ కారు మైలేజీ ఇతర కార్లకన్నా ఎక్కువగానే ఉంటుందని ఆయన అన్నారు. ప్రజల ఆర్థిక స్థితిగతులపై తాము ప్రత్యేక దృష్టి సారించామని ఆయన అన్నారు.

తమ కారు ద్వారా ప్రతి లీటరు పెట్రోలుకు దాదాపు 30 కిలోమీటర్ల మేరకు ప్రయాణించవచ్చని, మోటారు సైకిళ్ళకన్నా కార్లలో ప్రయాణించేందుకే తమ వినియోగదారులు ఇష్టపడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరి నాటికే తమ కారు మార్కెట్లోకి రావాల్సిందని, కాని టాటా కంపెనీకి పోటీనిచ్చేందుకు తక్కువ ఇంధనంతో ఎక్కువ మైలేజీ ఇచ్చేందుకు తాము 2012 నాటికి మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు.

వెబ్దునియా పై చదవండి