వడ్డీ రేట్లలో మార్పులుండవు: బ్యాంక్ ఆఫ్ ఇండియా

మంగళవారం, 10 నవంబరు 2009 (11:55 IST)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతం వరకు వడ్డీ రేట్లలో మార్పులుండవని, రుణాలు 18 శాతం వరకు పెరగవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

2009-10వ ఆర్థిక సంవత్సరంలో రుణాలు 18 శాతం పెరగవచ్చని, అదే విధంగా వడ్డీ రేట్లలో ఏ మాత్రం మార్పులుండవని బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్‌వి. నాయర్ అన్నారు.

సీఐఐ నిర్వహించిన ఓ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతం వరకు వడ్డీ రేట్లలో ఏ మాత్రం మార్పులుండవని ఆయన తెలిపారు.

బ్యాంక్ మార్జిన్‌పై ఆయన మాట్లాడుతూ... ఆర్థిక సంవత్సరంలో రెండున్నర శాతం వరకుండవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి తమ బ్యాంక్ మార్జిన్ 2.28 శాతంగా ఉండింది. అదే వచ్చే త్రైమాసికంలో కాస్త మెరుగైన ఫలితాలుండగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సెప్టెంబర్ చివరి నాటికి బ్యాంక్ సొమ్ము రుణాల రూపంలో 1.93 శాతం బయట ఉండిపోయిందని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి