విస్తరణ దిశగా అపోలో హాస్పిటల్స్‌

శనివారం, 30 జనవరి 2010 (12:36 IST)
దేశంలోని ప్రైవేట్ ఆసుపత్రుల రంగంలో అగ్రగామిగాను అపోలో హాస్పిటల్స్‌ సంస్థ దేశ, విదేశాల్లో భారీగా విస్తరింపజేసుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు ప్రకటించింది.

దేశీయ ప్రైవేట్ ఆసుపత్రుల రంగంలో అగ్రగామిగానున్న అపోలో అసుపత్రి యాజమాన్యం దేశ విదేశాల్లోనున్న తమ ఆసుపత్రులను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి మీడియాకు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న రెండు సంవత్సరాలలో తమ ఆసుపత్రులను దేశ, విదేశాల్లో విస్తరిస్తామని, దీనికిగాను రూ.1800 కోట్ల వరకూ వెచ్చిస్తామన్నారు. దేశంలోను అలాగే విదేశాల్లోని 70 ఆస్పత్రుల్లో 13,500 పడకల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు తాము లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇందులో భాగంగా దేశంలోని ఒరిస్సా రాజదాని భువనేశ్వర్‌లో ఫిబ్రవరి నెలలో 300 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. ఇటీవల అపోలో హాస్పిటల్స్‌కు ఐఎఫ్‌సీ 50 మిలియన్‌ డాలర్ల (రూ.230 కోట్లు) రుణాన్ని మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. ఈ సొమ్మును 'అపోలో రీచ్‌' ఆస్పత్రులకు వెచ్చించనున్నట్లు ఆయన వివరించారు.

వెబ్దునియా పై చదవండి