వేగంగా పెరిగి 17.7 శాతానికి చేరుకున్న ఆహార ద్రవ్యోల్బణం

గురువారం, 8 ఏప్రియల్ 2010 (15:22 IST)
FILE
మార్చి 27తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం వేగంగా పెరిగి 17.70 శాతానికి చేరుకుంది. దేశంలో పాలు, పండ్లు, పప్పుదినుసుల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం వేగంగా పెరిగిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

అదే అంతకు మునుపు వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం 16.35 శాతంగా ఉండింది. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతోపాటు ఇతర ఉత్పత్తుల ధరలు పెరిగాయి. మార్చి నెల ద్రవ్యోల్బణ సూచీ వచ్చే వారాంతానికి రాగలదని, ఇందులో రెండు అంకెలకు చేరుకోగలదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

అదే ఫిబ్రవరి నెలకు చెందిన మాసిక ద్రవ్యోల్బణంలో ఆహార, ఆహారేతర పదార్థాల ద్రవ్యోల్బణం 9.89 శాతానికి చేరుకుంది. ఇదే వార్షిక ద్రవ్యోల్బణం పరిస్థితి గమనిస్తే పప్పు దినుసులు 32.60 శాతం, పాలు 21.12 శాతం, పండ్లు 14.95 శాతం, గోధుమలు 13.34 శాతానికి ఎగబాకాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

వెబ్దునియా పై చదవండి