వేసవికి జెట్ ఎయిర్‌వేస్ ప్రత్యేక సర్వీసులు

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జెట్ ఎయిర్‌వేస్ కొత్తగా అత్యవసర సర్వీసును శుక్రవారం ప్రారంభించింది. జెట్ ఎయిర్‌వేస్ కొనెక్ట్ పేరుతో పిలిచే ఈ దేశీయ ప్రైవేట్ ఎయిర్‌లైన్ ముంబై-భోపాల్, ఉదయ్‌పూర్, అహ్మాదాబాద్ మధ్య విమాన సేవలు అందిస్తుంది.

సాధారణ ఎయిర్‌లైన్స్‌‍లో కంటే ఇందులో 10-15 శాతం తక్కువ ధరకే ప్రయాణం చేయవచ్చు. చెన్నై- కోయంబత్తూరు, మధురై, కోచి, బెంగళూరు- పూణే, మంగళూరు నగరాల మధ్య కూడా ఈ కొత్త ఎయిర్‌లైన్స్ సేవలు అందించనుంది.

శుక్రవారం నుంచి ఈ విమాన సేవలు ప్రారంభమవతాయని జెట్ ఎయిర్‌వేస్ వెల్లడించింది. కొన్ని రూట్లలో టిక్కెట్ ధరలు 20 శాతం వరకు తక్కువగా ఉంటాయని తెలిపింది.

కొత్త ఎయిర్‌లైన్స్‌కు జెట్ ఎయిర్‌వేస్ రెండు బోయింగ్ 737-800 విమానాలు, ఆరు చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందించనుంది. 19 రూట్లలో రోజూ 59 విమానాలు నడుపుతామని జెట్ ఎయిర్‌వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సుధీర్ రాఘవన్ విలేకరులతో చెప్పారు.

వెబ్దునియా పై చదవండి