సీఐఎఫ్ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికైన రతన్ టాటా

బుధవారం, 7 ఏప్రియల్ 2010 (11:31 IST)
FILE
ప్రపంచవ్యాప్తంగానున్న టాటా సంస్థలను పటిష్టవంతంగా నిర్వహిస్తుండటంతో ఈ ఏడాదికి గాను సీఐఎఫ్ చంచ్లానీ గ్లోబల్ ఇండియన్ అవార్డుకు టాటా సంస్థల అధినేత రతన్ ఎన్ టాటా ఎంపికైనారు.

సీఐఎఫ్ చంచ్లానీ గ్లోబల్ ఇండియన్ అవార్డుకు టాటా సంస్థల అధినేత రతన్ ఎన్ టాటాను ఎంపిక చేసినట్లు కెనడా ఇండియా ఫౌండేషన్ సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ అవార్డుతోపాటు 225,000(రూ. 1 కోటి)నగదును అందజేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

తాము అందించే ఈ పురస్కారాన్ని వచ్చే నెల 15న వ్యాన్కౌవెర్‌లో నిర్వహించే గాలా ఆఫ్ కెనడా ఇండియా ఫౌండేషన్ వార్షికోత్సవంలో అందజేయనున్నామని నిర్వాహకులు టోరంటోలో తెలిపారు

టాటా గ్రూప్ సంస్థలు భారతదేశంలోని వాణిజ్యరంగంలో 1962 నుంచి అగ్రపథాన నడుస్తున్నాయి. అప్పటి ఛైర్మెన్ జేఆర్‌డీ టాటా నేతృత్వంలో ఈ సంస్థ పురోగతిని సాధిస్తూ వ్యాపార రంగంలో ముందుకు దూసుకువెళుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సంస్థ ఆదాయం దాదాపు పన్నెండింతలు పెరిగింది.

వెబ్దునియా పై చదవండి