1.30 లక్షల మంది ఉద్యోగులకు ఇటలీ ఉద్వాసన!

ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కేందుకు ఇటలీ కంపెనీలు ఓ ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. ఇందులోభాగంగా ఈ యేడాది 1.30 లక్షల మంది ఉద్యోగులను తొలగించాలని ఇటలోని కంపెనీల యాజమానులు నిర్ణయించారు.

ఈ ఉద్యోగాల కోతలో దేశ దక్షిణ ప్రాంతం ఎక్కువ మూల్యం చెల్లించనున్నట్లు ఇటాలియన్‌ యూనియన్‌ ఆఫ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ (యూనియన్‌ కామెరే) అంచనా వేసింది. అబ్రుజ్జో, మొలైస్‌, బాసిలికాటా వంటి పేద ప్రాంతాలు ఈ సంక్షోభంతో తీవ్రంగా దెబ్బతింటాయని, వాటి ఆర్థిక వ్యవస్థ రెండు శాతం మేర కుంగిపోతుందని యూనియన్‌ కామెరే తెలిపింది.

10 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న కంపెనీల్లో పని చేస్తున్నవారిలో సుమారు 62 వేల మంది వీధి పాలవుతారు. 10 నుంచి 49 మంది ఉద్యోగులున్న కంపెనీల్లో 33 వేల మందిని, 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న కంపెనీలు 35 వేల మందిని తొలగించనున్నాయి.

వెబ్దునియా పై చదవండి