2 సంవత్సరాల తర్వాతో గోధుమల దిగుమతి

శనివారం, 14 నవంబరు 2009 (13:50 IST)
భారతదేశం 2007 తర్వాత తొలిసారిగా గోధుమలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆస్ట్రేలియా నుంచి పది వేల టన్నుల గోధుమలను దిగమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రతి టన్ను గోధుమలు 270-300 డాలర్లకు గాను దాదాపు పది వేల టన్నుల గోధుమలు భారతదేశానికి దిగుమతి చేయనున్నట్లు సింగపూర్ వ్యాపారస్తులు తెలిపారు. దీనిని భారతదేశంలోని వ్యాపారస్తులు నిర్ధారించారు.

ఇదిలావుండగా భారతదేశంలోని ప్రభుత్వ గోడౌన్‌లో సెప్టెంబర్ 30 నాటికి 2.82 కోట్ల టన్నుల గోధమలున్నాయి. కాని ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో గోధుమల ఉత్పత్తుల్లో తగ్గుదల కనపడే సూచనలున్నాయని, దీంతో గోధుమలను దిగుమతి చేసుకుంటున్నామని ప్రభుత్వాధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి