40 వేల యూనిట్ల విక్రయాలపై మారుతి దృష్టి!

శుక్రవారం, 15 జనవరి 2010 (11:37 IST)
దేశంలో కార్ల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థగా పేరుగాంచిన మారుతి సుజుకి సంస్థ తాజాగా ఎకో పేరుతో సరికొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కార్ల విక్రయాలను 2010 సంవత్సరంలో 40 వేల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ ప్రతినిధి గురువారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

మారుతి సుజుకి విడుదల చేసిన ఒమిని వ్యానుకు ప్రత్యామ్నాయంగా సి సెగ్మెంట్‌ మోడల్‌లో ఎకో కారును ప్రవేశపెట్టింది. ఈ మోడల్‌ ఎంతో ఆకర్షణీయంగా ఉందని వినియోగదారులు అంటున్నారు. అందువల్ల వీటిని భారీ సంఖ్యలో విక్రయించాలని మారుతి కంపెనీ నిర్ణయించింది.

దీనిపై మారుతి కంపెనీ ఇంజనీరింగ్ రీసెర్స్, డిజైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ సీజీఎం సీబీ.రామన్ మాట్లాడుతూ.. వెర్సా మోడల్‌కు ఇది ప్రత్యామ్నాయం మాత్రం కాదన్నారు. తమ కంపెనీ సక్సెస్‌ను ఒక వాహనం మాత్రమే చేరుకోలేదన్నారు. అయితే, ఈ రకం మరిన్ని ఆఫర్లకు దోహదపడుతుందన్నారు.

వెబ్దునియా పై చదవండి