అగ్గి పెట్టె ధరలు రూ.1 నుంచి రూ.2లకు పెంపు

మంగళవారం, 26 అక్టోబరు 2021 (18:25 IST)
Match box
అగ్గి పెట్టె ధరలు 14 ఏళ్ల తరవాత పెరగనున్నాయి. ఇప్పటివరకు రూ.1 కి లభించిన అగ్గిపెట్టె ఇకపై రూ.2 లకు లభించనుంది. అగ్గిపెట్టెలను డిసెంబరు 1 నుంచి రూ.2 చొప్పున విక్రయిస్తామని తయారీ సంస్థలు ప్రకటించాయి. అగ్గిపుల్లల తయారీలో వినియోగించే 14 రకాల ముడి పదార్థాల ధరలు పెరిగాయని, అందుకే అగ్గిపెట్టె ధర కూడా పెంచుతున్నట్లు వివరించాయి. 
 
రెడ్‌ ఫాస్ఫరస్‌ ధర రూ.425 నుంచి రూ.810 కి, మైనం ధర రూ.58 నుంచి రూ.80కి పెరిగిందని పేర్కొన్నాయి. బాక్స్‌ బోర్డులు, పేపర్‌, పొటాషియం క్లోరేట్‌, గంధకం వంటి ధరలు కూడా పెరిగాయని తయారీ సంస్థలు చెబుతున్నాయి. ఇంధన ధరల వల్ల రవాణా ఛార్జీలు కూడా భారమయ్యాయని పేర్కొన్నాయి. 
 
ఈ నేపథ్యంలో అగ్గిపెట్టె తయారీదార్లకు సంబంధించి 5 సంఘాలు శివకాశీలో సమావేశమై, ధరలు పెంచాలని నిర్ణయించాయి. ఒక అగ్గిపెట్టె ధరను 50 పైసల నుంచి రూ.1కి పెంచుతూ 2007లో నిర్ణయం తీసుకోగా, మళ్లీ ఇప్పుడు పెంచుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు