అమేజాన్ పే లేటర్ పేరిట వున్న సదుపాయానికి ముందుగా డిజిటల్ పద్ధతిలో సైనప్ కావాలి. అక్కడ అడిగిని వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత రుణం వెంటనే మంజూరవుతుంది. అయితే... మనం కొనుగోలు చేసిన సరుకు తాలూకు డబ్బును అమేజాన్ ముందుగానే సంబంధిత సంస్థకు చెల్లిస్తుంది. ఆ తర్వాత కొనుగోలుదారులు... అమేజాన్‌కు చెల్లించాల్సి ఉంటుంది.
ఇందులో భాగంగా చిన్న దుకాణాలు, చిల్లర వ్యాపారులు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి వీలు కల్పించే ఉద్దేశంతో అమేజాన్ కూడా కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో తన కొత్త ప్రోగ్రామ్ 'అమెజాన్ లోకల్ షాప్స్'ను ప్రకటించింది.