సామాన్యులకు షాకిచ్చే వార్త.. పెరగనున్న బిస్కెట్ ధరలు

గురువారం, 31 మార్చి 2022 (22:19 IST)
సామాన్యులకు షాకిచ్చే వార్త ఇది. భారత అతిపెద్ద బిస్కెట్ల తయారీదారు బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్..బిస్కెట్ల ధరలను 7 శాతం మేర పెంచాలని ప్రణాళికలను రచిస్తోంది. 
 
ద్రవ్యోల్బణ ప్రభావంతో తొలుత 3 శాతం మేర ధరల పెంపును సూచించగా...ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో ధరల పెంపును 8 నుంచి 9 శాతం మేర పెంచాలని కంపెనీ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటానియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ వరుణ్‌ బెర్రీ అభిప్రాయపడ్డారు. 
 
గత రెండేళ్లలో ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని వరుణ్‌ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ ప్రభావంతో గత త్రైమాసికంలో బ్రిటానియా నికర ఆదాయంలో 19 శాతం తగ్గుదలను నమోదుచేసింది.
 
కాగా బ్రిటానియాతో పాటుగా...ఇతర బిస్కెట్‌ కంపెనీలు కూడా ధరలను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ​కాగా ధరలను పెంచే బదులుగా క్వాంటిటీ తగ్గించి అమ్మకాలు జరపాలనే నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని టాక్ వస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు