ఏకంగా ట్విట్టర్లో అయితే జోకులు పేలాయి. ఇకపై సింగిల్ సిగరెట్ ఉన్న ప్యాకెట్లు మార్కెట్లోకి వదిలితే సరి అని ఓ ట్వీట్లో పేర్కొన్నారు. మరో వ్యక్తి, దీని ద్వారా రెండు విషయాలు జరుగుతాయన్నాడు. పాన్ వాలాలను వేధించడానికి పోలీసులకు మరో కారణం దొరుకుతుందని, ప్రజలు ఇకపై సిగరెట్లు తాగాలనుకుంటే గుంపుగా వచ్చి కొనుగోలు చేస్తారని ట్వీట్ చేశాడు.