2జీ స్కామ్ దర్యాప్తు బాధ్యతలు ఇక ఆర్.కే. దత్తాకే!

శనివారం, 22 నవంబరు 2014 (12:56 IST)
2జీ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ అదనపు డైరెక్టర్ ఆర్.కే. దత్తా చేపట్టనున్నారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను తొలగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం సంగతి తెలిసిందే. 
 
సిన్హా తర్వాత అత్యున్నత హోదా కలిగిన అధికారి 2జీ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టాలని కూడా కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీబీఐలో సిన్హా తర్వాత అత్యున్నత హోదా కలిగిన అధికారిగా దత్తానే ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి