రూ. 102కి పెరిగిన కందిపప్పు ధర: గణనీయంగా పెరిగిన పప్పు ధరలు!

సోమవారం, 30 మార్చి 2015 (10:53 IST)
పప్పు ధరలు గణనీయంగా పెరిగిపోయాయి.  బియ్యం, పప్పు, నూనె తదితరాల ధరలు, ముఖ్యంగా, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ధరలు గణనీయంగా పెరిగాయి. జనవరిలో రూ. 72 ఉన్న కిలో కందిపప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ. 102లకు చేరుకుంది. దీంతో పేదలు, చిరుద్యోగుల బతుకులు భారంగా మారుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి.
 
రెండు నెలల క్రితం సోనా మసూరి (కొత్త) బియ్యం ధర క్వింటాల్ రూ. 3 వేల వరకూ ఉండగా ప్రస్తుతం రూ. 3400లకు చేరింది. ఇక పాత బీయం ధర క్వింటాల్‌‌కు రూ. 4800 నుంచి రూ. 5000లు వరకూ ధర పలుకుతోంది. వీటికి తోడు కారం, చింతపండు, ధనియాలు, పల్లీలు, పుట్నాలు, బెల్లం, పంచదార తదితర నిత్యావసరాల ధరలు కిలోకు రూ.6 నుంచి రూ. 10 వరకూ పెరిగాయి. నెల బడ్జెట్‌‌లో అధికభాగం ఆహార, నిత్యావసరాలకే కేటాయించాల్సి వస్తోందని చిరుద్యోగులు వాపోతున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజల బతుకులు సైతం ధరల పెరుగుదలతో భారంగా మారాయి.

వెబ్దునియా పై చదవండి