రైతులకు లాభాలను పెంచుకోవడంలో సహాయపడుతున్న గోద్రెజ్ అగ్రోవెట్ పైనా

సోమవారం, 24 జులై 2023 (18:52 IST)
గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్, క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ నేడు కంపెనీ యొక్క PYNA బ్రాండ్ ఉత్పత్తులు పత్తి రైతులకు ఎకరాకు అయ్యే సాగు ఖర్చును గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొంది. పర్యావరణ అనుకూల పత్తి ఉత్పత్తి కోసం ఒక అంబ్రెల్లా బ్రాండ్, PYNAలో పత్తి కలుపు నిర్వహణ ఉత్పత్తులు భాగంగా వున్నాయి. ఈరోజు రైతులు పంటలకు సంబంధించి అత్యంత కీలకమైన సీజన్‌లో తీవ్రమైన కూలీల కొరతను ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు భారీ వర్షాల వల్ల కూలీలతో  కలుపు తీయించటం లేదా వ్యవసాయ యంత్రాల వినియోగం కష్టతరమవుతున్నాయి, ఈ సవాళ్లను అధిగమించడానికి మరియు ఉత్పాదకతను పెంచడానికి ఈ వినూత్న పరిష్కారాలు రూపొందించబడ్డాయి.
 
GAVL, క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్, సీఈఓ రాజవేలు ఎన్.కె మాట్లాడుతూ, “GAVL వద్ద, మేము పర్యావరణ అనుకూల పత్తి ఉత్పత్తి పద్ధతులను ప్రోత్సహిస్తూ వ్యవసాయ ఉత్పాదకత మరియు లాభదాయకతను మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నాము. మా PYNA బ్రాండ్ ఉత్పత్తులు పత్తి రైతులకు గణనీయంగా ఖర్చును తగ్గిస్తున్నాయి, తద్వారా వారి ఆర్థిక విజయానికి సహకరించడం మేము గౌరవంగా భావిస్తున్నాము. భారతీయ రైతుల జీవనోపాధిని పెంచడమే మా అంతిమ లక్ష్యం కాబట్టి, PYNA ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో కింద కొత్త సాంకేతికతలను పరిచయం చేయడానికి మరియు కొత్త మిశ్రమాలు మరియు సూత్రీకరణలను ఆవిష్కరించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము" అని అన్నారు.
 
“PYNA బ్రాండ్ యొక్క విజయానికి 15 సహ-బ్రాండెడ్ కంపెనీలు, బహుళజాతి సంస్థలు మరియు భారతీయ కంపెనీలతో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యం కారణమని చెప్పవచ్చు. PYNA బ్రాండింగ్ నాణ్యత నియంత్రణను నిర్ధారిస్తుంది మరియు గోద్రెజ్ , దాని సహ-మార్కెటర్ల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేస్తూ రైతుల మధ్య నమ్మకాన్ని కలిగిస్తుంది, ”అని ఆయన చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు