హెచ్‌సీసీబీ నుంచి అమీన్‌పూర్‌ ఫ్యాక్టరీలలో రెండు నూతన పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్ట్‌లు

శుక్రవారం, 18 డిశెంబరు 2020 (22:01 IST)
భారతదేశంలో అగ్రశ్రేణి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఒకటైన హిందుస్తాన్‌ కోకా-కోలా బేవరేజస్‌ (హెచ్‌సీసీబీ) విజయవంతంగా రెండు అదనపు పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులను విజయవాడ మరియు అమీన్‌పూర్‌ (హైదరాబాద్‌ సమీపంలో) మహమ్మారి సమయంలో తమ ఫ్యాక్టరీల వద్ద ప్రారంభించింది. వీటిలో భాగంగా అమీన్‌పూర్‌ ఫ్యాక్టరీ వద్ద సోలార్‌ రూఫ్‌టాప్‌ ప్యానెల్‌ను ప్రారంభించడంతో పాటుగా విజయవాడలోని ఫ్యాక్టరీ కోసం సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి ఒప్పందమూ చేసుకుంది. ఈ మహమ్మారి సమయంలో ఏడు అదనపు పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్ట్‌లను ప్రారంభించింది.
 
అమీన్‌పూర్‌ ఫ్యాక్టరీలోని సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్యానెల్‌ ప్రాజెక్ట్‌ను దాదాపు 800 కిలోవాట్‌పవర్‌ సామర్ధ్యంతో ఏర్పాటుచేశారు. విజయవాడ ఫ్యాక్టరీ కోసం, హెచ్‌సీసీబీ ఇప్పుడు స్లిలాండ్రో పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కొనుగోలు ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా ఆరు మిలియన్‌ యూనిట్ల సౌర విద్యుత్‌ను సరఫరా చేయనుంది.
 
ఫ్యాక్టరీల కోసం పునరుత్పాదక విద్యుత్‌ను సమీకరించడంలోని ఆవశ్యకత గురించి అలోక్‌ శర్మ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సప్లయ్-చైన్‌, హెచ్‌సీసీబీ మాట్లాడుతూ, ‘‘సస్టెయినబల్‌ ఆధారిత కంపెనీగా నిలువాలనే మా ప్రయత్నంలో అతి ముఖ్యమైన మైలురాయిగా ఈ ప్రాజెక్ట్‌ల విజయం నిలుస్తుంది.

పునరుత్పాదక విద్యుత్‌ వనరులను వినియోగించేందుకు అవకాశాలను గురించి మా బృందం నిరంతరం అన్వేషిస్తూనే ఉంటుంది. సరైన మార్గంలో వ్యాపారాలను చేయాలనే మా నిబద్ధతలో భాగం ఇది మరియు వాతావరణ మార్పులకు సంబంధించిన ప్రభావాన్ని తగ్గించాలనే మా ప్రయత్నంలో సరైన దిశగా వెళ్లేందుకు స్వచ్ఛమైన మరియు ఆహ్లాదకరమైన విద్యుత్‌ను వినియోగించడాన్ని మేము విశ్వసిస్తున్నాము’’ అని అన్నారు.
 
విజయవంతంగా హెచ్‌సీసీబీ ప్రారంభించిన పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్ట్‌లలో గుజరాత్‌లోని సనంద్‌ మరియు గోబమెజ్‌ మరియు మహారాష్ట్రలోని వాదా; కర్నాటకలోని బిదాడీ ప్రాజెక్టులు ఉన్నాయి. కంపెనీకు చెందిన విభిన్న ఫ్యాక్టరీలలో  ఏర్పాటుచేయడం ద్వారా ఈ ప్రాజెక్టులను 23.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను సేకరించేందుకు పలు రాష్ట్రాల గ్రిడ్‌లతో  విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) సైతం చేసుకుంది.

గాలి, సౌర మరియు బయోమాస్‌ వనరులతో ఉత్పత్తి చేసే ఈ పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులు ద్వారా దాదాపు 2 లక్షల టన్నుల కార్బన్‌ ఉద్గారాలను ప్రతి సంవత్సరం తగ్గించనున్నట్లు అంచనా. హెచ్‌సీసీబీలో పునరుత్పాదక విద్యుత్‌ వనరుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యను ఇప్పుడు దాదాపు సంవత్సరానికి 70 మిలియన్‌ యూనిట్ల నుంచి 93 మిలియన్‌ యూనిట్లకు వృద్ధి చేశారు.
 
గతంలో, హెచ్‌సీసీబీకు చెందిన 15 ఫ్యాక్టరీలలో 13 ఫ్యాక్టరీలలో 100% ఎల్‌ఈడీ లైటెనింగ్‌ను 2019లో చేరుకుంది. దీనితో పాటుగా ఈ కంపెనీ ఇప్పుడు సీఎన్‌జీ ఫ్యూయల్‌ను తమ బాయిలర్స్‌ నిర్వహణ కోసం వినియోగిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు